తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 14 2024, 09:26

PM Modi: రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో

హైదరాబాద్: పార్లమెంట్ (Parliament) ఎన్నికల ప్రచారం (Election Campaign)లో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)కు రానున్నారు..

పది రోజుల వ్యవధిలో మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో (Road Show) నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు (BJP Leaders) రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలో 1.3 కి.మీ. మేర ప్రధాని రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న (శనివారం) నాగర్‌కర్నూల్‌లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 14 2024, 09:16

TSPSC: ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్

Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది..

ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్పీఎస్సీ స్వీకరిస్తోంది. అయితే, ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు TSPSC అధికారులు వెల్లడించారు..

కాగా, గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, ఇవాళే.. చివరి రోజు కాబట్టి ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 14 2024, 09:14

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు సీఎం జగన్ పర్యటన..

కర్నూలు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

 ఈ సందర్భంగా కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బనగానపల్లెలో రూ.22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 13 2024, 14:09

ఈ నెల 16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌..

అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.

కాగా, రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 13 2024, 13:51

ఈ చవట దద్దమ్మలకు కరెంటు సక్కగ ఇయ్యొస్తలేదా?: మాజీ సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగా రు.

మంచినీటి, సాగునీటి సర ఫరాలో, కరెంటు సప్లయ్‌ లో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఘోరంగా విఫలమైం దని ఆయన మండిపడ్డారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడు తుందని భరోసా ఇచ్చారు.

కరీంనగర్‌ కదనభేరి సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమ స్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్‌ భగీరత పథకం తీసుకొచ్చినం.

ఆదిలాబాద్‌ గోండు గూడెం నుంచి నల్ల గొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసి నం. బ్రహ్మాండంగా మంచినీ టి సరఫరా చేసినం. ఇప్పు డున్న ప్రభుత్వానికి ఆ పథా కాన్ని నడిపే తెలివి లేదా..? ఎందుకు మిషన్‌ భగీరథలో సమస్యలు వస్తున్నయ్‌..?’ అని ప్రశ్నించారు.

‘నేను ముఖ్యమంత్రి అయిన ప్పుడు ఏడాదినర్థం తిరగ కుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపా టు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటువచ్చిం ది.

రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతు బంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతు బంధు ఏసుడు చేత నైత లేదా..? కేసీఆర్‌ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసి నట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మి దేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్త లేదా..?’ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఎయ్యకపో యినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా..జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు.

ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది. ఇయ్యాల చెప్పుతో కొడుత అన్నోడు రేపు నిజంగనే కొడుతడు. ఇట్ల మోసపో దామా..? లేదంటే గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీల ను గెలిపించి ముందుకు పోదామా..? ఇది మన తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలె.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరి తే ప్రజల పక్షాన కాపలాదా రులుగా అంత బ్రహ్మాండంగా ముందుకు పోతం’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 13 2024, 13:48

స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది స్కూల్ విద్యార్థుల యూని ఫామ్‌లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు జీవో జారీ చేసింది.

ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను అప్పగిం చనుంది. 63.44 లక్షల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందిం చాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో, విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడె న్షియల్ సంక్షేమ పాఠశాల లకు 63.44 లక్షల జతల యూనిఫామ్స్ అవసరమ వుతాయి. ఈ యూనిఫా మ్స్‌ను 45 రోజుల్లో కుట్టించాల్సి ఉంటుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:25

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం.  

కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. 

విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ లబ్ధిదారులకు అందజేయనున్న సీఎం...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:20

శత్రుభయంకర అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం... గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ

భారత్ రక్షణ రంగ చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

ఈ క్షిపణిని పూర్తి దేశీ యంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లో కి పంపగా, అంచనా లను అందుకుంటూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను ఆనందో త్సాహాలకు గురిచేసింది.

ఈ ప్రాజెక్టుకు మిషన్ దివ్యా స్త్రగా నామకరణం చేశారు. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్- MIRV టెక్నాలజీ వినియోగించారు.

MIRV టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక... అందులోని వార్ హెడ్ పలు విభాగాలుగా విడిపోయి, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.

మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేప థ్యంలో ప్రధాని మోడీ... DRDO సైంటిస్టులను అభినందించారు. DRDO శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 12 2024, 09:18

AP News: అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ

విజయవాడ (గాంధీనగర్‌), ముమ్మిడివరం: వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు (కోడికత్తి శ్రీను) జైభీమ్‌ భారత్‌ పార్టీలో చేరారు..

సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్‌ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Mar 09 2024, 15:22

ఎండిన పంటలను అంచనా వేసి ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి

ఎండిన పంటలు అంచనా వేసి ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జునప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం మండల పరిధిలోని పలు గ్రామాలు అప్పాజీపేట, కంచనపల్లి, అనంతరం, కొత్తపల్లి, జి చెన్నారం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాగుచేసిన పంట పొలాలు తమ కళ్ళముందే చేతికొచ్చే సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి రైతులు అనేక ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో రైతులు నిబ్బరంగా ఉండాలని రైతులను కోరారు. ఇలాంటి విపత్కర సమయాలలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని  అవేదన వ్యక్తం చేశారు. నివారించడం కొరకు ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే నష్టపోయిన పొలాలను పర్యవేక్షించిపంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ముందు చూపుతో వ్యవహరించి ఎస్ఎల్బీసీ కాల్వకు నీళ్లు వదిలినట్లయితే ఎంతో కొంత భూగర్భ జలాలు పెరిగి పంటలు ఎండిపోకుండా ఉండడానికి దోహదపడేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు రైతుల పంటలను త్వరగా అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ రైతులు పోషబోయిన యాదయ్య, దేప రామకృష్ణారెడ్డి, పోషవోని మల్లయ్య, కేతిపల్లి యాదయ్య, కల్లూరి రాములు, పోలే తానేష బకరం చిన్న, కాసర్ల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు